epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

రేపు హైదరాబాద్‌కు రేవంత్.. మంత్రులతో కీలక భేటీ

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలోని (Harvard University) కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’లో లీడర్‌షిప్‌ కోర్సును విజయవంతంగా పూర్తిచేశారు. 62 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో జరిగిన ఈ శిక్షణలో ఆయన గ్లోబల్ నాయకత్వం, ఆర్థిక వృద్ధి, యువత, రైతులు, మహిళల సంక్షేమంపై చర్చల్లో పాల్గొన్నారు. విదేశీ పర్యటన ముగించుకున్న ఆయన ఫిబ్రవరి 2 హైదరాబాద్‌‌కు రానున్నారు. రేపు తెల్లవారుజామున 2.45 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. దాదాపు రెండు వారాల తర్వాత సీఎం రేవంత్ హైదరాబాద్‌‌కు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం.. రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అనుసరించాల్సిన గెలుపు వ్యూహాల గురించి చర్చించే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఎన్నికల్లో రెబల్స్ అభ్యర్థులకు చెక్ పెట్టేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించే అవకాశాలున్నాయి. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ, సింగరేణి స్కాం, తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు రానున్నాయి.

Read Also: సుప్రీం అంటే మీరేనా..? విచారణలో సిట్​ ప్రశ్నలివే..

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>