ఇండిగో విమానానికి తప్పిన భారీ ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: పుణె నుంచి గువాహటికి 192 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) భారీ ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ గేర్ ముడుచుకుపోయిందని గుర్తించి పైలట్లు వెంటనే పుణె ఏటీసీకి సమాచారం అందించారు. ఏటీసీ సూచనలతో తిరిగి పుణె ఎయిర్‌పోర్టులోనే ఎమర్జెన్సీ సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లైట్‌ను ఐసోలేషన్ బేకు తరలించిన ఇంజినీర్లు.. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనపై ఇండిగో అధికార ప్రతినిధి స్పందించారు. ‘ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే మరో విమానం ఏర్పాటు చేసి, గమ్యస్థానాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాం. విమాన ప్రయాణం రద్దు చేసుకునేవారికి రీఫండ్ కూడా చెల్లిస్తాం. ప్రయాణికుల భద్రతకే ఇండిగో పెద్దపీట వేస్తుంది’ అని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>