Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీసులకు కవిత స్ట్రాంగ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha)  పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండా మహిళలను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద కవిత ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు కవితతోసహా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆందోళనకారులను పోలీసులు బస్సులో పీఎస్ తరలించారు. ఈ బస్సులో ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేకపోవడం గమనార్హం. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే మహిళలను అరెస్ట్ చేయడం పట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకోవడం సరైంది కాదని కవిత (Kavitha) విమర్శించారు. మహిళల అరెస్టులో విధి విధానాలు పాటించలేదని ఆరోపిస్తూ పోలీసుల తీరును వారు తప్పుబట్టారు. ఇక వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కవిత తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>