కవితకు ఎన్నికల సంఘం బిగ్ షాక్.. ‘TRS’ పేరు కుదరదు!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ పేరుతో పొలిటికల్ కార్యచరణ చేస్తున్న కల్వకుంట్ల కవిత (Kavitha)కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె నెలకొల్పిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరును మార్చుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది.

TRS షార్ట్ ఫామ్ పై బీఆర్ఎస్ తో సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసిన వేళ ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ కు ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరు వల్ల ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఈసీ భావించింది. దీంతో 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని కవితకు రాసిన లేఖలో ఆదేశించింది. నిర్ణీత గడువులోగా కొత్త పేర్లను ప్రతిపాదించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా క్లోజ్ చేస్తామని హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>