కలం, వెబ్‌డెస్క్: ఏపీలో ఖాళీగా ఉన్న 807 మద్యం షాపులకు ఏపీ ఎక్సైజ్ శాఖ (AP Excise Eepartment) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో మొత్తం 3,650 షాపుల రెన్యువల్‌కు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,236 షాపులను రెన్యువల్ చేసుకున్నారు. మరో 414 షాపుల యజమానులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు. గతంలో మిగిలిన షాపులతో కలిసి మొత్తం 807 షాపులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 3న దరఖాస్తులను పరిశీలించనున్నారు. అక్టోవర్ 5న లాటరీ పద్ధతిలో షాపులను కేటాయిస్తారు.

