Mobile Popup Ad
Mobile Popup Ad

నేతన్నల పొట్టకొట్టే కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం: కవిత

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల జీవితాలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) మండిపడ్డారు. విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించి ఇచ్చే ఆర్డర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ ఏకపక్షంగా రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.105 కోట్ల విలువైన టెండర్ రద్దు కావడంతో 393 చేనేత సహకార సంఘాల్లోని వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలు, ఇతర డిపార్ట్మెంట్లు సైతం రూ.200 కోట్ల విలువైన దుప్పట్లు, ఇతర దుస్తుల పంపిణీకి గడువు ముగిసినా టెస్కో కు ఆర్డర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పుడు విద్యాశాఖ ఉన్న ఆర్డర్ రద్దు చేసి.. టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. ఏదో ఒక సంస్థకు మేలు చేయడానికి వేలాది చేనేత కార్మిక కుటుంబాల పొట్టకొట్టే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. విద్యార్థుల యూనిఫాంలు సహా ప్రభుత్వ శాఖల టెండర్లు టెస్కోకు ఇచ్చే వరకు చేనేత కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని కవిత పిలుపునిచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>