సీఎం రేవంత్ రెడ్డి మహిళలను అవమానించారు : కవిత

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ‘స్టాండ్ విత్ హర్’ అనే ప్రోగ్రామ్ తో మహిళలను అవమానించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఫైర్ అయ్యారు. మగవాళ్లు ఉంటేనే మహిళలు ముందుకెళ్తారు అనే విధంగా సీఎం ప్రోగ్రామ్ నిర్వహించారని.. కానీ ‘గివ్ హర్ స్పేస్’ (Give Her Space) అనేది జాగృతి నినాదం అని చెప్పుకొచ్చారు కవిత. బంజారాహిల్స్ లోని జాగృతి ఆఫీస్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కవిత కేక్ కట్ చేసి గివ్ హర్ స్పేస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళలకు చిన్న, పెద్ద, అనే తేడాలు లేవని.. మహిళలంతా ఒకటే కులం అని చెప్పుకొచ్చారు. కేసీఆర్, జయశంకర్ లాంటి వారు ఈ నేలన నడిచారంటే దానికి వారి తల్లులే కారణం అన్నారు.

మహిళలపై పెరిగిన క్రైమ్ రేటు..

కేవలం మహిళా దినోత్సవం రోజే కాకుండా అన్నిరోజుల్లోనూ మహిళలను గౌరవించే రోజులు రావాలని కవిత తెలిపారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చాక మహిళలపై క్రైమ్ రేటు 22 శాతం పెరిగింది. మహిళలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని బిక్షగా చూడొద్దు. ఆడవారు లేకుంటే ఏ రంగం కూడా ముందుకెళ్లదు. అంతెందుకు మహిళలు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. మహిళలు తలచుకుంటే ఎన్నో పోరాటు చేయగలుగుతారు. అవన్నీ చేయాలంటే ఈ రోజుల్లో ఆడవారికి చదువుతో పాటు ఎంప్లాయ్మెంట్, ఎక్సర్ సైజ్ కూడా ముఖ్యమే. రాజకీయాల్లో వయసుతో పనిలేకుండా మహిళలు రాణించాలి. ఆడవారికి 33 శాతం రిజర్వేషన్ సాధనతో జాగృతి చరిత్ర సృష్టించింది’ అంటూ కవిత వెల్లడించారు.

పురుషాధిక్యతను సహించేది లేదు..

సమాజంలో మహిళలపై ఎలాంటి ఆధిక్యత ఉన్నా సహించేది లేదన్నారు కవిత. అందులోనూ సామాజిక, పురుషాధిక్యాన్ని అస్సలు సహించబోమన్నారు. ‘మహిళలు మహారాణులు అంటారు. కానీ వంటింటి పాత్రలపై కూడా పురుషుల పేర్లే ఉంటున్నాయి. బిడ్డను కంటున్నాం గానీ.. పేరు పెట్టే స్వాతంత్య్రం కూడా మాకు లేదు. అలాంటి ధోరణి పోవాలి. ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ఉంటున్నారు. అవకాశం వస్తే రాజకీయాల్లో రాణించేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ పొలిటికల్ పార్టీలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ జాగృతిలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నాం. ఇక్కడ పెద్ద పదవులు ఇవ్వబోతున్నాం. ఆడవారికి లీడర్ ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తాం’ అన్నారు కవిత.

ఎన్నికల వరకు ఆ బిల్లు రావాలి..

మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో జాగృతి (Telangana Jagruthi) పోరాడిందని కవిత తెలిపారు. ‘కానీ దాన్ని అమలు చేయడానికి జనగణన అంటూ లేట్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా ఆ బిల్లును అమలు చేయాలి. అన్ని కులాల నుంచి మహిళలు రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో మహిళలు ఉన్నదే 0.0003 శాతం. ఇక్కడ మాకే నిలబడే స్పేస్ లేదు. ఇంక మమ్మల్ని ఎలా ఎదగనిస్తారు. సర్పంచ్, ఎమ్మెల్యే సీట్లలో ఛాన్స్ వచ్చినా.. మళ్లీ మగవాళ్లే వెనకుండి అన్నీ నడిపిస్తున్నారు. ఇది మారాలి. కానీ సీఎం రేవంత్ మాత్రం స్టాండ్ విత్ హర్ అంటూ ఆడవారి పక్కన మగవారు ఉండాలి అన్నట్టు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి మగ, ఆడ అనే బేధాలు ఉండొద్దు’ అంటూ చెప్పారు.

అన్నీ తెలుసుకోవాలి..

ఆడవారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha). ‘ఆడవారు అన్ని రంగాల్లో లోకజ్ఞానం సంపాదించుకోవాలి. పేపర్లు, న్యూస్ చూస్తూ ఉండాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి. అప్పుడే మనం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలుగుతాం. లేదంటే మగవారు మనల్ని తక్కువ చేసి మాట్లాడుతారు. మహిళలకు నిజమన స్వాతంత్య్రం రావాలంటే మహిళా ఆర్మీని నిర్మించాలి. తెలంగాణలో ఆడవారిపై క్రైమ్ రేటు తగ్గించేందుకు పోలిసింగ్ ను పెంచాలి’ అన్నారు కవిత.

ఫ్రీ బస్ కాదు.. ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి..

మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటే కావాల్సింది ఫ్రీ బస్ కాదని.. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు కవిత (Kavitha). కేరళ రాష్ట్రాన్ని అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేవలం అగ్ర కులాలు, రిజర్వేషన్ ఉన్న కులాల మహిళలు మాత్రమే కాకుండా.. మిగతా అన్ని కులాల నుంచి మహిళలు రాజకీయాల్లోకి రావాలని కవిత చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ ఉత్తుత్తి మాటలు పక్కన పెట్టి.. మహిళలకు ఇచ్చిన నెలకు రూ.2500, ఇతర హామాలను నెరవేర్చాలన్నారు.

Read Also: విమెన్స్ డే స్పెషల్ : బ్రిలియంట్ ఆఫీసర్.. సైలెంట్ ఆపరేషన్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>