కలం, కరీంనగర్ బ్యూరో: భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల దరఖాస్తులను పెండింగ్ లో పెట్టడం, తరచూ విధులకు గైర్హాజరు కావడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై హుజురాబాద్ (Huzurabad) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ డి.చందనను సస్పెండ్ చేస్తూ వరంగల్ జోన్ జాయింట్ లేబర్ కమిషనర్ వినీత ఉత్తర్వులు జారీ చేశారు. చందనపై వచ్చిన ఆరోపణల మీద ఇటీవల కరీంనగర్ డిప్యూటీ లేబర్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ విచారణ జరిపారు. వాళ్లు సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను, పథకాలను సిటిజన్ చార్టర్ ప్రకారం ఆపకుండా, త్వరగా పరిష్కరించాలని లేబర్ కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. లేదంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also: 25 ఏళ్ల తరువాత ఏంటి ?.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Follow Us On: Facebook

