ఫిరాయింపుల కేసు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కలం, వెబ్‌ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs) కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ పిటిషన్ ను డిస్పోజ్ చేస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ (BRS) వేసిన పిటిషన్లపై స్పీకర్ తీర్పు ప్రకటించినట్టు ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) సుప్రీంకోర్టు తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో తీర్పు కాపీలు పిటిషనర్లకు ఇవ్వాలని, ఈ కేసు ఆధారాలు మరియు పిటిషనర్ అడిగే వివరాలు 4 రోజుల్లో అందచేయాలని స్పీకర్‌ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు (Defected MLAs), స్పీకర్‌కు భారీ ఊరట దక్కిందని చెప్పొచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. రాజకీయ ఒత్తిళ్ల వల్లే స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతున్నదని ఆసక్తికరంగా మారింది. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ మళ్లీ హైకోర్టులో కొత్త పిటిషన్ వేస్తారా? అనేది వేచి చూడాలి.

Read Also: నెట్‌ఫ్లిక్స్‌కు సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>