Mobile Popup Ad
Mobile Popup Ad

జాగృతి కార్యాల‌యంలో క‌విత నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల (Velugumatla) బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో నిరవధిక నిరహార దీక్ష చేప‌ట్టారు. సోమ‌వారం రాత్రి ఖ‌మ్మంలోని అంబేడ్క‌ర్ భ‌వ‌న్‌లో నిరాహార‌ దీక్ష చేప‌ట్టిన క‌విత‌ను పోలీసులు ఈ రోజు ఉద‌యం అరెస్ట్ చేసి హైద‌రాబాద్‌ కు త‌ర‌లించారు. అయితే క‌విత త‌న దీక్ష‌ను కొన‌సాగిస్తాన‌ని ప్ర‌క‌టించారు. వెలుగుమ‌ట్ల బాధితుల‌కు ప్ర‌భుత్వం న్యాయం చేయాల‌ని, ఇండ్లు కోల్పోయిన ప్ర‌తి ఒక్క‌రికీ మ‌ళ్లీ అదే చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం ఎన్ని కుట్ర‌లు చేసినా బాధితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌న పోరాటం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. జాగృతి కార్యాల‌యంలో రాజ్యాంగాన్ని చేత‌ప‌ట్టి క‌విత దీక్ష కొన‌సాగిస్తున్నారు.

Read Also: కొత్త గవర్నర్‌కు సీఎం స్వాగతం.. రేపే ప్రమాణం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>