Mobile Popup Ad
Mobile Popup Ad

జడ్జినే భయపెట్టారు: డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ దోపిడీ!

కలం, వెబ్​ డెస్క్​ : సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సామాన్యులే కాదు, చట్టంపై అవగాహన ఉన్నవారు కూడా వారి మాయమాటలకు బలైపోతున్నారు. తాజాగా నేరేడ్‌మెట్ ప్రాంతంలో నివసించే 73 ఏళ్ల ఓ రిటైర్డ్ జడ్జిని ఎనిమిది రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)పేరుతో గృహనిర్బంధంలో ఉంచి, ఏకంగా రూ. 1.66 కోట్లు దోచుకున్నారు.

వివరాల ప్రకారం.. బాధితుడికి ఒక గుర్తుతెలియని వ్యక్తి వీడియో కాల్ చేశాడు. తనను తాను సిబిఐ అధికారిగా పరిచయం చేసుకుని, బాధితుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని భయపెట్టాడు. ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడారని, మనీ లాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కేసుల్లో బెంగళూరులో (Bengaluru) కేసులు నమోదయ్యాయని నమ్మించాడు. అంతేకాకుండా, సుప్రీంకోర్టు మీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని, ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని హెచ్చరించాడు.

నేరగాళ్ల బెదిరింపులకు భయాందోళనకు గురైన బాధితుడు, వారు అడిగిన ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన బ్యాంక్ ఖాతా నుండి రూ.1.66 కోట్లు మాయమయ్యాయి. సుమారు ఎనిమిది రోజుల పాటు బాధితుడిని డిజిటల్ (Digital Arrest) పర్యవేక్షణలో ఉంచి, ఎవరికీ చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: ఆలయంలో భారీ చోరీ.. న‌గ‌లు, డ‌బ్బు మాయం!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>