Mobile Popup Ad
Mobile Popup Ad

మరో స్వాతంత్య్ర పోరాటంలా తెలంగాణ ఉద్యమం: కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమం అనేది మరో స్వాతంత్య్ర పోరాటం మాదిరిగా జరిగిందని తెలంగాణ రక్షణ సేన పార్టీ (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని మది నిండా, ఆర్తితో గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు. కచ్చితంగా వారందరీ రుణం తీర్చుకుంటామని మాట ఇస్తున్నట్లు తెలిపారు. ఆస్తులు, ఉద్యోగాలు పొగొట్టుకోని మరో స్వాతంత్ర పోరాటం మాదిరిగా తెలంగాణ ఉద్యమం చేసిన వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి..

తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించుకున్న 12 ఏళ్ల తర్వాత కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకపోవటం అన్యాయమని చెప్పారు. తెలంగాణ జాగృతి తరఫున నాలుగు జిల్లాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకున్నామని.. కానీ హైదరాబాద్ లో ఆయన విగ్రహాం ఉండాల్సిన అవసరముందన్నారు. అందుకే నిన్న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయటం జరిగిందిన్నారు. తెలంగాణ ఉద్యమానికి సైద్దాంతిక పునాదులు వేసిన జయశంకర్ సార్ విగ్రహాం రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తమకు అవకాశం ఇస్తే విగ్రహా ఏర్పాటు ఖర్చుతో పాటు లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ ను తామే చేస్తామన్నారు. ఆగస్ట్ 6 న జయశంకర్ సార్ జయంతి ఉందని.. ఆ లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తాం..

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని కవిత మండిపడ్డారు. ఈరోజు జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేస్తాడని భావించామని చెప్పారు. కానీ ఆ అంశాన్ని ఆయన మాట్లాడలేదని.. కేకే కమిటీ విధివిధానాలను కూడా చెప్పకపోవటం దుర్మార్గమని అన్నారు. ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ ను తలపించేలా భూపోరాటం చేస్తామని.. జులై 2 న ఉప్పల్ భగాయల్ లో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తామని ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవటం దుర్మార్గమన్నారు. జూన్ 2 అంటే ఒక హాలిడే కాదని.. మనకు వివక్ష లేకుండా, మన యాసను మాట్లాడుకునేలా చేసిన రోజు అని చెప్పారు. మన చరిత్రను కచ్చితంగా ఇప్పటి పిల్లలంతా కూడా తెలుసుకోవాలన్నారు. ఆగస్ట్ 15 న ఎంతో గొప్పగా వేడుకలు జరుపుకుంటామో.. జూన్ 2ను కూడా అంతే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>