కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా బాసర మండలంలో రైతులకు సాగునీరు అందించేందుకు బాసర లిఫ్ట్ ఇరిగేషన్‌ను ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్‌లో అదనపు తరగతి గదులను తనిఖీ చేసి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

