పోలీసులపై రైతుల దాడి.. తీవ్ర కలకలం

కలం, వెబ్ డెస్క్: శంషాబాద్ (Shamshabad) సమీపంలోని బహదూర్ గూడలో పలువురు రైతులు పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో డీసీపీ యోగేశ్ గౌతమ్, పలువురు సీఐలకు గాయాలయ్యాయి. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు, రాళ్లు విసిరేశారు. బుల్లెట్ ట్రైన్‌ భూ సేకరణకు సంబంధించి ఉదయం నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే చేతికి దొరికిన వాటిని దొరికినట్లుగా పోలీసులపైకి విసిరేస్తూ దాడికి పాల్పడ్డారు.

భూములు ఇవ్వబోమని..

బుల్లెట్ ట్రైన్ నిర్మాణంలో భాగంగా బహదూర్ గూడలో 650 ఎకరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ మేరకు భూములు కోల్పోతున్న రైతులతో కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. పరిహారంగా 500 గజాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది తమకు అవసరం లేదని.. మార్కెట్ రేట్ల ప్రకారమే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో భూమి స్వాధీనం చేసేందుకు రెవెన్యూ, హైడ్రా అధికారులు రావడంతో రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారితో మాట్లాడుతున్న క్రమంలోనే.. ఒక్కసారిగా గొడవ ముదిరి పోలీసులపై దాడి వరకు వెళ్లింది.

దాడులు కరెక్ట్ కాదు..

బందోబస్తుకు వెళ్లిన తమపై దాడి చేయడాన్ని పోలీస్ అధికారులు తీవ్రంగా తప్పుబట్టారు. రైతులు పరిహారం విషయంలో ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా చర్చలు జరుపుకోవచ్చని.. కానీ, ఇలా దాడులు చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. కాగా, ఈ ఘటనలో డీసీపీ యోగేశ్ గౌతమ్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అక్కడికి అంబులెన్స్ రప్పించి, ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

Read Also: ధరణి సాక్షిగా ఘరానా మోసం: కలెక్టర్ సీరియస్ యాక్షన్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>