కలం, వెబ్ డెస్క్ : దుబాయ్ లో లక్కీ లాటరీలో కర్ణాటకు చెందిన ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. అబుదాబి ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ లో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీలో కర్ణాటకు చెందిన శంతను శెట్టిగన్ అనే వ్యక్తి రూ.49 కోట్లు గెలుచుకున్నాడు. ఆయన టికెట్ నంబర్ డ్రాలో ఎంపిక కావడంతో అదృష్టవంతుడిగా మారాడు. శంతను శెట్టి ఉద్యోగం నిమిత్తం యూఏఈకి వెళ్లాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో డ్రాలో తనకు లాటరీ తగలడంతో ఆతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో చాలా మంది దుబాయ్ లో ఈ తరహా లాటరీ గెలుచుకున్నారు.


