epaper
Wednesday, February 18, 2026
epaper

నేడు జోగి ర‌మేష్ ఇంటికి జ‌గ‌న్‌.. వివాదంలో రూట్‌మ్యాప్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) నేడు ఇబ్ర‌హీంప‌ట్నం (Ibrahimpatnam)లోని జోగి ర‌మేష్ (Jogi Ramesh) ఇంటికి వెళ్ల‌నున్నారు. ఇటీవ‌ల టీడీపీ (TDP) కార్య‌క‌ర్త‌లు జోగి ర‌మేష్ ఇంటిపై దాడి చేసిన నేప‌థ్యంలో ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌ను జ‌గ‌న్‌ ప‌రామ‌ర్శించ‌నున్నారు. అలాగే దాడి జ‌రిగిన ఇంటిని ప‌రిశీలించ‌నున్నారు. దీని కోసం వైసీపీ ఇప్ప‌టికే రూట్ మ్యాప్ సిద్ధం చేసి విడుద‌ల చేసింది. అయితే, ఇటీవ‌ల జ‌గ‌న్ అంబ‌టి రాంబాబు కుటుంబాన్ని కూడా ప‌రామ‌ర్శించారు. ఈ స‌మ‌యంలో కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. 50 కిలో మీట‌ర్ల దూరం కూడా లేకున్నా ప‌ర్య‌ట‌న మాత్రం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు సాగింది.

దీన్ని దృష్టిలో పెట్టుకొని నేడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై పోలీసులు ఆంక్ష‌లు విధించారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న కోసం సిద్ధం చేసిన రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని రూట్ మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే పోలీసులు నోటీస్ కూడా జారీ చేశారు. కానీ, దీనిపై పార్టీ నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు. జ‌గ‌న్ విజ‌య‌వాడ న‌గ‌రం నుంచి కాకుండా బ‌య‌టి నుంచి వెళ్లాల‌ని సూచిస్తున్నారు. మ‌రి ఈరోజు జ‌గ‌న్ (YS Jagan) ప‌ర్య‌ట‌న ఎలా సాగుతుంద‌న్న‌ది వేచి చూడాలి.

Read Also: విజ‌య్‌కి షాకిచ్చిన‌ మ‌ద్రాస్ హైకోర్ట్‌..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>