కలం, వెబ్ డెస్క్: కర్ణాటకకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ (పౌర హక్కుల అమలు డైరెక్టరేట్) రామచంద్రరావు (Karnataka DGP) కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీస్ యూనిఫామ్‌లోనే, తన చాంబర్‌లోనే కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియోతో తనకు ఏ సంబంధం లేదని.. ఇదంతా ఏఐ క్రియేటెడ్ అంటూ డీజీపీ చెబుతున్నారు. మరి కర్ణాటక ప్రభుత్వం ఈ అధికారిపై చర్యలు తీసుకుంటుందా? అన్నది వేచి చూడలి.
ఈ వీడియో ఎప్పటిది?
వైరల్ అవుతున్న ఈ వీడియో సుమారు ఏడాది క్రితం నాటిదని కొందరు పేర్కొంటున్నారు. డీజీపీ స్థాయి అధికారి మీద ఇటువంటి ఆరోపణలు రావడం హాట్‌టాపిక్‌గా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావు రామచంద్రరావు కూతురు కావడం గమనార్హం. అయితే తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఈ వీడియో రూపొందించారని రామచంద్రరావు పేర్కొన్నారు. అయితే మీడియా ప్రశ్నలకు మాత్రం పూర్తిస్థాయిలో సమాధానాలు ఇవ్వలేదు. “ఇది నా ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ప్రయత్నం” అని మాత్రమే DGP రామచంద్రరావు వ్యాఖ్యానించారు.
రామచంద్రరావు ఎవరు?
కె. రామచంద్రరావు కర్ణాటక క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. గతంలో కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అదనపు డీజీపీ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2023లో ఆయనకు డీజీపీగా (Karnataka DGP) పదోన్నతి లభించి, కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఛైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పౌర హక్కుల అమలు డైరెక్టరేట్ డీజీపీగా నియమితులయ్యారు.
Read Also: దొంగతనానికి వచ్చి నిద్రపోయిన దొంగ
Follow Us On: X(Twitter)


