Mobile Popup Ad
Mobile Popup Ad

కర్నాటక సీటు సమరం: ఢిల్లీకి చేరిన సీఎం కుర్చీ పంచాయితీ!

కలం, వెబ్‌ డెస్క్ : కర్నాటక (Karnataka) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు హస్తినకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాయకత్వ మార్పుపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ కీలక పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ రోజు కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ఈ ఇద్దరు అగ్ర నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదా పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారా అనే కోణంలో అధిష్ఠానం వీరితో చర్చించనుంది. కేవలం నాయకత్వ మార్పే కాకుండా, కర్నాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా ఈ భేటీలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాబోయే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, స్థానిక ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై అధిష్ఠానం వీరితో సుదీర్ఘంగా సమాలోచనలు జరపనుంది. ఈ ఢిల్లీ పర్యటన తర్వాత కర్నాటక రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>