Mobile Popup Ad
Mobile Popup Ad

ఇదేం బాదుడు.. మరోసారి పెరిగిన CNG ధర!

కలం, వెబ్‌ డెస్క్ : దేశంలో ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల భారంతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులపై ఇప్పుడు సిఎన్‌జి (CNG) భారం కూడా పడింది. సిఎన్‌జి ధర (CNG Price)ను కేజీకి 2 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెరిగిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.

గడిచిన 11 రోజుల వ్యవధిలో సిఎన్‌జి ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిఎన్‌జి ధర 83.09 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లోనే మూడు సార్లు ధరలు పెరగడంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>