రేషన్ బియ్యం పాలిష్.. సన్న బియ్యంగా సేల్!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ దందా (Rice Scam)పై సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని సేకరించి, వాటిని పాలిష్ చేసి కార్పొరేట్ కంపెనీల బ్రాండింగ్‌తో సన్న బియ్యంగా బహిరంగ మార్కెట్లో రూ.80 నుండి రూ.100 వరకు అమ్ముతున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.

కర్మన్‌ఘాట్ పరిధిలోని పలు రైస్ డిపోలు, దుకాణాల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా దుకాణాలు నిర్వహించడం, బియ్యం సంచుల్లో తక్కువ బరువుతో విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. అధికారులు పలు దుకాణాల నుండి బియ్యం నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం తరలించారు. తనిఖీల సమయంలో అధికారులను చూసి పలువురు దుకాణదారులు షాపులు మూసివేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>