రైతుల చేతికి చిక్కిన దొంగలు.. ఆ తరువాత ఏమైందంటే..?

కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్‌పల్లి గ్రామంలో పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు (Chain Snatching) యత్నించిన ఇద్దరు దొంగలను స్థానిక రైతులు అప్రమత్తతతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పొలంలో పనిచేస్తున్న కిష్టమ్మ అనే మహిళపై ఇద్దరు దుండగులు దాడి చేసి ఆమె మెడలోని పుస్తెల తాడును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో, సమీప పొలాల్లో పనిచేస్తున్న రైతులు వెంటనే స్పందించి ఆ దొంగలను వెంబడించి పట్టుకున్నారు. పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన దొంగల్ని ఆ మహిళ కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

పోలీసులు విచారణలో నిందితులను హత్నూర మండలం ముచ్చర్లకు చెందిన వడ్డే సాయిలు, మీనంపల్లికి చెందిన అరవింద్‌గా గుర్తించారు. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు జిన్నారం సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>