బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ (BSc Nursing) కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్-యూజీ 2026 పరీక్షకు హాజరైన అభ్యర్థులతో పాటు, ఏపీ ఈఏపీసెట్-2026 లో అర్హత సాధించిన విద్యార్థులకు కూడా తుది మాప్-అప్ కౌన్సెలింగ్ రౌండ్లో ప్రవేశాలు కల్పించేలా వెసులుబాటు కల్పించింది.

ఈ కోర్సుల్లో చేరాలనుకునే ఆసక్తిగల అభ్యర్థుల సౌలభ్యం కోసం దరఖాస్తు రిజిస్ట్రేషన్ గడువును మరో 10 రోజులు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>