కరీంనగర్ సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట

కలం, కరీంనగర్: కరీంనగర్‌లో(Karimnagar) బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి, యువ సమరభేరి సభ అపూర్వ విజయాన్ని సాధించడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో భయం మొదలైందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ (Challa Harishankar) అన్నారు. సభ విజయవంతం కాలేదంటూ మేయర్ కోలగాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ భయానికి నిదర్శనమని పేర్కొన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ (Bandi Sanjay) కరీంనగర్ అభివృద్ధికి చేసిందేమీ లేదని హరిశంకర్ విమర్శించారు. బీజేపీ నగరపాలక సంస్థలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదని ఆరోపించారు. కేవలం జనరల్ ఫండ్స్‌తో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

ఏళ్లు గడుస్తున్నా రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడమే బండి సంజయ్ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. మరోవైపు కరీంనగర్ నగరంలో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా మారిందని, మేయర్‌గా కోలగాని శ్రీనివాస్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అధికారులపై మేయర్‌కు సరైన నియంత్రణ లేదని విమర్శించారు. నగర సమస్యల పరిష్కారం కోసం సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి, ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హరిశంకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ-శ్రీనివాస్, షేక్ యూసుఫ్, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి-మహేష్, నందేల్లి రమాదేవి, దిండిగాల మహేష్, కంసాల శ్రీనివాస్, ఎడ్ల అశోక్, బోనాల శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, నక్క కృష్ణ, జక్కని ఉమాపతి, నాయకులు గడ్డం ప్రశాంత్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు, నేతి రవివర్మ, గంగాధర చందు, పటేల్ సుధీర్ రెడ్డి, నారదాసు వసంతరావు, అరే రవి, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, నయీమ్, చేతి చంద్రశేఖర్, మంతిని కిరణ్, పిట్టల శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్, చొక్కారపు చంద్రం, మేచినేని పవన్, మహిళా నాయకురాళ్లు కంజర్ల రేణుక, గంటల రేణుకతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>