కలం, కరీంనగర్ బ్యూరో: పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కరీంనగర్ ఉజ్వల పార్క్ లోని పీవీ విగ్రహాన్ని తెలంగాణ రక్షణ సేన నాయకులు (Karimnagar TRS) శుభ్ర పరిచి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో ఉజ్వల పార్క్ లో ఉన్న పీవీ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించడంలో జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు పూర్తిగా విస్మరించారని గుంజపడుగు హరిప్రసాద్ విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన నాయకులే పార్క్ లో ఉన్న విగ్రహాన్ని శుద్ధి చేయించి పూల మూలాల వేసి నివాళులు అర్పించడం జరిగిందని చెప్పారు. పీవీని కాంగ్రెస్ పార్టీ అవమాన పరుస్తునే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో పుట్టి పెరిగిన పీవీ నరసింహారావు.. దేశ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. అనేక భాషలు తెలిసిన బహుభాషా కోవిదుడు మన పివి అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారని, రాజకీయాలలో మంథని ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో అనేక భూ సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు.
కేంద్ర మంత్రిగా తన హయాంలో విదేశాంగ, హోంశాఖ, రక్షణ, మానవ వనరుల శాఖ మంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులు, విదేశీ కంపెనీలకు భారత మార్కెట్ లోకి పెద్దఎత్తున ఆహ్వానించడంతో భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టిందన్నారు. ఆర్ధికంగా బలోపేతం కావడానికి ఆరోజు పివి తీసుకున్న నిర్ణయాలే ఒక కరణం అని కొనియారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు నూతి చరణ్, ఉమార్, సుత్రాల రాజన్న, సంతోష్ తదితరులు ఉన్నారు.

