తిమ్మాపూర్‌లో ఘనంగా ‘అంగన్ మిలన్ సే – అంగన్వాడి ఉత్సవ్’

కలం, తిమ్మాపూర్: భారత ప్రధాని మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (Thimmapur) మండల వ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ‘అంగన్ మిలన్ సేవ’ – ‘అంగన్వాడి ఉత్సవ్’ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రాలను సందర్శించి, అంగన్వాడి టీచర్లు, ఆయాలను సన్మానించి, చిన్నారులకు , మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. అంగన్వాడిల అభివృద్ధి కోసం , చిన్నారుల సంక్షేమం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బీజేపీ నాయకులు ఆయా ప్రాంతాలలో వివరించి మాట్లాడారు.

రామకృష్ణ కాలనీలో..

గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో టీచర్లు గంగు సునీత, ఫరీదా, ఆయాలు రొడ్డ కనకవ్వ, మునిగంటి కనకలక్ష్మిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.బీజేపీ మాజీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి అంగన్వాడి టీచర్లు, ఆయాలకు చీరలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు కోతి రాజు, రేగూరి సుగుణాకర్, వేల్పుల ఓదయ్య, శాబోలు గణేష్, స్థానిక హెచ్‌ఎంలు మహేష్, సత్యనారాయణ, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

మక్తపల్లిలో..

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మక్తపల్లి అంగన్వాడి కేంద్రాన్ని మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు వరలక్ష్మి, నాయకులు చింతం లక్ష్మణ్, ప్రదీప్ రెడ్డి లు సందర్శించి, టీచర్‌ నిర్మలను సన్మానించి వారి సేవలను అభినందించారు.

రామహనుమాన్ నగర్ లో..

తిమ్మాపూర్ మండలం రామహనుమాన్ నగర్ అంగన్వాడి కేంద్రాన్ని స్థానిక బీజేపీ శ్రేణులు సందర్శించి, చిన్నారులకు అందిస్తున్న పోషకాహార వివరాలు తెలుసుకున్నారు. టీచర్ నందికొండ హైమావతిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ పిస్క సౌజన్య, ఉప సర్పంచ్ అందే శేఖర్, వార్డు సభ్యులు ఉప్పులేటి ప్రవీణ్ తదితరులు పాల్గొని పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు.

గొల్లపల్లిలో..

గొల్లపల్లి అంగన్వాడి కేంద్రాన్ని ప్రోగ్రాంలో భాగంగా బీజేపీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో సందర్శించారు. అంగన్వాడి టీచర్లు పాశం సరోజన, ఆయా కర్ఱ రాజేశ్వరిలను సేవలకు గాను చిరు సత్కారం చేశారు.పిల్లలకు ఆటవస్తువులు సమకూర్చాలని టీచర్ లు బిజెపి నాయకులను కోరగా వారి కోరిక మేరకు త్వరలో ఆటవస్తువులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పిల్లలకు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, బూత్ అధ్యక్షుడు బండి స్వామి, మాజీ వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు మంచికట్ల శ్రుతేష్, పిల్లలు, తల్లులు పాల్గొన్నారు.

తిమ్మాపూర్ లో..

తిమ్మాపూర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని బీజేపీ నాయకులు రామిడి మహేందర్ రెడ్డి, జక్కోజు అనిల్ లు సందర్శించారు. అంగన్వాడీ టీచర్ ను ఈ సందర్భంగా సన్మానించి చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు.

అలుగునూర్-2లో..

అలుగునూర్-2 కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల సమగ్ర అభివృద్ధికి, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అంగన్వాడి టీచర్ లతను సన్మానించి, చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుడు చిందం అంజి, అంగన్వాడి సిబ్బంది, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>