Mobile Popup Ad
Mobile Popup Ad

మళ్లీ యాక్టివ్‌గా కరీంనగర్ జిల్లా టాస్క్ ఫోర్స్ విభాగం

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో అక్రమ వ్యాపారాలకు సింహస్వప్నంగా నిలిచిన టాస్క్ ఫోర్స్ విభాగం (Karimnagar Task Force) మళ్లీ యాక్టివ్ అయ్యింది. గతంలో కొన్ని వివాదాలు, అవినీతి ఆరోపణలతో కొంతకాలం మసకబారిన ఈ విభాగం ప్రతిష్ట ఇప్పుడు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపుతూ వరుస దాడులతో దూసుకుపోతోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై కూడా టాస్క్ ఫోర్స్ కన్నెర్ర చేసింది. ఈ నెల 9న కరీంనగర్ మార్కెట్ పరిధిలో కల్తీ కాల్తీ కారం పొడి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 50 బస్తాల కారం పొడి, పసుపు, ధనియాల పొడి సీజ్ చేశారు. తదుపరి చర్యల కోసం వీటిని ఫుసేఫ్టే అధికారులకు అప్పగించారు.

ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిత్యం మనం వాడే పాలు, పన్నీర్, నెయ్యి, టీ పొడి వంటి అనేక నిత్యావసర వస్తువులను కొందరు కేటుగాళ్లు ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రామగుండం టాస్క్ ఫోర్స్ విభాగాన్ని రద్దు చేయాలనే చర్చ నడిచింది. కానీ ఈ విబాగాన్ని మూసివేయడం కన్నా మరింత సమర్దవంతంగా పనిచేసేలా చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులు దీనికి కొత్త దిశానిర్దేశం చేశారు. గతంలో కమాచారం లీక్ చేస్తున్నారనే ఆరోపణల నేపధ్యంలో పాత సిబ్బందిని అటాచ్ చేసి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

నకిలీ విత్తనాలు, కల్తీ ఆహార పదర్దాల తయారీపై ఇకపై దాడులు మరింత తీవ్రం అవుతుతాయని సిపి గౌష్ ఆలం హెచ్చరిస్తున్నారు. అక్రమ దందాలు చేస్తే టాస్క్ ఫోర్స్ ఆద్వర్యంలో కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్ట చేస్తున్నారు. కేవలం దాడుల విభాగంలోనే కాకుండా నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించేలా ఈ ప్రత్యేక యూనిట్ ను తీర్చిదిద్దుతున్నారు. కరీంనగర్ టాస్క్ ఫోర్స్ రీ ఎంట్రీతో అక్రమారులకు గుండెల్లో వణుకు మొదలైంది. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ వ్యాపారంపై ఉక్కు పాదం మోపేందుకు సిద్దం అవుతున్నారు.

కాసుల వేట.. ప్రజారోగ్యంతో ఆట..

కరీంనగర్‌లో కల్తీ దందా (ఆహార పదార్థాల కల్తీ) తీవ్ర రూపం దాల్చుతోంది, కొందరు వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, మార్కెట్‌లో నకిలీ వస్తువుల చలామణి పూర్తిగా అదుపులోకి రావడం లేదు. ఇటీవలి కాలంలో కరీంనగర్ పరిధిలో వెలుగుచూసిన ప్రధాన కల్తీ రకాలు, అధికారుల చర్యల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఇక టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రజారోగ్యంపై విశ్వాసం పెరుగుతోందనే చెప్పవచ్చు.

కల్తీ కారం, మసాలాల దందా

• జూన్ 2026 లో కరీంనగర్ శనివారం మార్కెట్ పరిధిలోని రెండు దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
• దాదాపు 47 బస్తాల కల్తీ కారం పొడి, 2 బస్తాల పసుపు, ధనియాల పొడిని ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.
పాల పదార్థాలు & బేకరీల కల్తీ
• కరీంనగర్, రామగుండం, జగిత్యాల పరిధిలో హానికరమైన రసాయనాలు, యూరియా మరియు నీటిని కలిపి కృత్రిమ పాలు, పెరుగు, వెన్న తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.
• సుభాష్ నగర్‌లోని గణేష్ బెంగళూరు బేకరీలో జరిపిన తనిఖీల్లో దుర్వాసన వస్తున్న 750 పాడైపోయిన గుడ్లను, వాటితో తయారు చేసిన 20 కిలోల కేకులను అధికారులు పట్టుకుని పారేశారు.
హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘన
• చాలా హోటళ్లలో ఒకసారి వాడిన వంట నూనెనే పదే పదే వాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు.
• బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్ లో మోతాదుకు మించి నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు.
నకిలీ మందుల దందా
• గతంలో కరీంనగర్‌లోని డాక్టర్స్ స్ట్రీట్‌లో ఉన్న కొన్ని మెడికల్ ఏజెన్సీలపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ దాడులు చేసి, ఫిట్స్ వ్యాధికి వాడే నకిలీ ‘లెవిపిల్ 500’ టాబ్లెట్లను స్వాధీనం చేసుకుంది.
సమస్యకు ప్రధాన కారణాలు
• ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కల్తీని అరికట్టేందుకు తగినంత మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడం కల్తీ కేటుగాళ్లకు కలిసి వస్తోంది.
• పట్టుబడిన వ్యాపారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం, కేవలం నామమాత్రపు ఫైన్లతో వదిలేయడం వల్ల దందా అగడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>