Mobile Popup Ad
Mobile Popup Ad

గ‌న్నేరు ప‌ప్పు తిని కరీంన‌గ‌ర్‌ ఎస్సై భార్య ఆత్మ‌హ‌త్య‌!

క‌లం, వెబ్ డెస్క్‌: క‌రీంన‌గ‌ర్‌ (Karimnagar)లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. టూ టౌన్‌లో ఎస్సై (SI)గా పని చేస్తున్న చంద్ర శేఖర్ భార్య దివ్య గ‌న్నేరు ప‌ప్పు తిని ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ టూ టౌన్ ఎస్సైగా ప‌ని చేస్తున్న చంద్ర‌శేఖ‌ర్ కుటుంబంతో వన్ టౌన్ పరిధిలోని హునుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. చంద్ర శేఖర్ భార్య దివ్య మంగళవారం ఇంట్లో గన్నేరు పప్పు దంచుకొని తిన్నారు. కొద్ది సేప‌టికి తీవ్ర అస్వస్థకు గురైన దివ్యను కుటుంబ‌స‌భ్యులు గ‌మ‌నించి స్థానిక‌ ఆసుపత్రికి త‌ర‌లించారు.

ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. హైద‌రాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ దివ్య నేడు మృతి చెందారు. దివ్య ఆత్మహత్యకు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. చంద్రశేఖర్, దివ్య దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వీరిద్ద‌రూ ఏడేళ్లలోపు వారే. చిరు ప్రాయంలోనే తల్లిని కోల్పోయిన ఆ బిడ్డలను చూసి స్థానికులు ఆవేద‌న‌ వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు దంపతుల మధ్య గొడవ జరిగినట్లు స‌మాచారం. కుటుంబ కలహాల‌తోనే దివ్య ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

Read Also: మార్చి 31న‌ సైలెన్స్‌కు బ్రేక్.. సోష‌ల్ మీడియాలో అనుష్క పోస్ట్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>