కలం, వెబ్ డెస్క్: ఘాటీ సినిమా పరాజయం అనంతరం జేజమ్మ అనుష్క శెట్టి (Anushka Shetty) సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె రెండు మూడు సినిమాలు చేస్తున్నప్పటికీ వాటి నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. అనుష్క ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. ఈ తరుణంలో ఈ మధ్యే ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. బెంగళూరుకు చెందిన ఓ బడా వ్యాపార వేత్తతో అనుష్క పెళ్లి చేసుకుంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2026 ఎండింగ్‌లోనే ఈ పెళ్లి జరుగనుందని పలు కథనాలు వచ్చాయి.
ఇలా పెళ్లి వార్తలు వస్తున్న సమయంలోనే లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. మార్చి 31న సైలెన్స్ బ్రేక్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది అనుష్క పెళ్లి గురించి కాదు.. ఆమె నటిస్తున్న కథనార్ (Kathnar) మూవీ గురించి. రోజిన్ థామస్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కథనార్. మళయాలంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 14 భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మార్చి 31న కీలక అప్‌డేట్ రానున్నట్లు స్వీటీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇక చాలా రోజుల తర్వాత అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

