Mobile Popup Ad
Mobile Popup Ad

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

కలం, మెదక్​ బ్యూరో​ : సిద్దిపేట (Siddipet) జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక రైతు ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన రైతు మోహన్ రెడ్డి (45) తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా సుమారు నాలుగున్నర లక్షల రూపాయల అప్పులు ఉండటం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు తనకున్న భూ సమస్యలు కూడా తోడవ్వడంతో మానసిక ఒత్తిడికి లోనై ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

మోహన్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూతుళ్ల చదువులకు సరిపడా డబ్బులు లేకపోవడం, పెరుగుతున్న అప్పుల భారంతో ఆయన కుంగిపోయారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also: 2029లో తెలంగాణ ఎలక్షన్స్.. కాంగ్రెస్‌కు ప్లస్‌ అయ్యేనా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>