జీవో 97ను రద్దు చేయండి.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన దీక్షలు

కలం, కరీంనగర్ బ్యూరో: జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, డిప్లొమా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ జిల్లా (Karimnagar) బొమ్మకల్ లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని జాతీయ విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీనివల్ల సాంకేతిక విద్య ప్రైవేట్ పరం అయ్యే అవకాశం ఉందని ఆరోపించారు. కాబట్టి పాలిటెక్నిక్ విద్యను దానిలో విలీనం చేయొద్దని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను కాపాడుకోవడం ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యత అని.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కేవలం వారి స్వంత ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తున్నారు తప్ప విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తి విఫలమవుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఇష్యూపై ఏమాత్రం కూడా చలనం లేకుండా ముఖ్యమంత్రి ఉండడం సిగ్గుచేటు అని అన్నారు. విదేశాల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి స్వదేశంలో విద్యార్థుల సమస్యలు వినబడడం లేదా ? అని నిలదీశారు.

పోలీసులు విద్యార్థుల గొంతులు నొక్కుతూ విద్యార్థి ఉద్యమాలని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని, విద్యార్థులు భయపడకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం డిప్లొమా విద్యార్థుల సమస్యను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, సన్నిత్ నాయకులు రిషి ,సాయి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>