Mobile Popup Ad
Mobile Popup Ad

పేకాట స్థావరంపై దాడి.. 12 మంది అరెస్ట్

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాపువాడలోని ఒక ప్రైవేట్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట (త్రీ కార్డ్స్) స్థావరంపై పోలీసులు (Karimnagar Police) మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించి, భారీగా నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు కాపువాడలోని సదరు ప్రైవేట్ నివాసంపై దాడి చేశారు. డబ్బులు పణంగా పెట్టి జూదం ఆడుతున్న 12 మంది వ్యక్తులను అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.

​జూదరుల నుండి రూ. 37,670/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ​వారి వద్ద ఉన్న 12 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఒక రెనాల్ట్ (Renault) కారు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ​అరెస్టయిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లు మరియు వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగింది. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు (Karimnagar Police) హెచ్చరించారు.

Read Also: భార‌త్‌ను చూసి అమెరికా నేర్చుకోవాలి.. ఫారిన్ యువ‌తి ప్ర‌శంస‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>