కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని సర్కారు పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, వసతిగృహాల విద్యార్థులకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్‌లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దీంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి సర్కార్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా, వసతిగృహాల విద్యార్థులకు ప్రభుత్వం ‘యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లు’ అందించనుంది. దీనిద్వారా డే స్కాలర్స్ కు 7, రెసిడెన్షియల్ విద్యార్థులకు 22 వస్తువులను ప్రభుత్వం అందిస్తోంది. పుస్తకాలు, యూనిఫాం, షూలు, బ్యాగులతో కూడిన ఈ యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్లను రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.
ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి రూ.50.73 కోట్లతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.36.65 కోట్లతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

