ఆస్ప‌త్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే క‌ఠిన‌ చర్యలు: వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.వెంకటరమణ

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తప్పవని కరీంనగర్ (Karimnagar) జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ వెంకటరమణ హెచ్చరించారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రాజగోపాల్, పీఓ డీటీటీ డాక్టర్ ఉమాశ్రీ, పీఓ ఎంఎచ్ఎన్ డాక్టర్ సనా జవేరియాతో కలిసి కరీంనగర్ పట్టణంలోని వన్ హాస్పిటల్‌తో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వన్ హాస్పిటల్లో లిఫ్ట్ సరిగా పని చేయకపోవడంపై జిల్లా వైద్యాధికారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం పాటించాల్సిన నిబంధనలను పరిశీలించారు.

ఈ సంద‌ర్బంగా డాక్టర్ వెంకట రమణ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఆస్పత్రి బాధ్యత అని తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా ఆస్పత్రి యాజమాన్యాలు రోగుల భద్రత, పారిశుధ్యం, అత్యవసర సేవల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>