కలం, కరీంనగర్ బ్యూరో: పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని, శక్తి స్కీమ్ ను వెనక్కి తీసుకోని SBTET కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ (Karimnagar ABVP) ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి NTR చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్, విద్యార్థులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుతున్న పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే విధంగా స్కిల్ ఇండియా పేరుతో చేస్తున్న కుట్రను మానుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించారు.
శక్తి స్కిమ్ పేరుతో SBTET తొలగించి విద్యార్థులను మరింత ఉన్నత చదువులకు వెళ్లనివ్వకుండా, అందరిని లేబర్ ల వలె తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఐటిఐ ఒకేషనల్ పాలిటెక్నిక్ ఒకే రకమైన విద్యలో భాగం కాలేవని, పాలిటెక్నిక్ ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కనీస మౌలిక వస్తువులు లేకుంఆ ప్రభుత్వ కళాశాలలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని.. ప్రభుత్వం కనీసం వాటిని అయినా మెరుగుపరిచాలన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 97 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న అంతరార్థం చెప్పాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని, నిరంతరం విద్యార్థుల వెంట ఏబీవీపీ ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి చిప్ప యోగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, విగ్నేష్,విష్ణు, వంశీ,ఆకాష్ ,యశ్వంత్, అజయ్, చరణ్, శివ, సూర్య తదితరులు పాల్గొన్నారు.

