ఎదురెదురుగా ఢీకొన్న వాహనాలు.. ఇద్దరు డ్రైవర్లు మృతి

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం (Kanpur Road Accident) చోటుచేసుకుంది. సచేండి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ఓ కంటైనర్ ట్రక్కు, ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి.

ఢీకొన్న తీవ్రతకు ఇద్దరు డ్రైవర్లు వాహనాల క్యాబిన్ల లోపలే చిక్కుకుపోయి గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సచేండి పోలీసులు క్యాబిన్లలో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లను బయటకు తీశారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>