కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు (Mudhole MLA) పటేల్ శుక్రవారం పంపిణీ చేశారు. మొత్తం 31 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక చేయూత అందుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

