దక్షిణాది రాష్ట్రాలను ఆదుకోండి.. మోదీకి కవిత రిక్వెస్ట్

కలం, వెబ్ డెస్క్: సూపర్ ఎల్ నినో (Super El Nino) ప్రభావంతో కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్ర సహా దక్షిణాది రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రధాని మోదీకి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) విజ్ఞప్తి చేశారు. ఇంతటి దుర్భిక్ష సమయంలో కేంద్రం సాయం చేయకపోతే కచ్చితంగా ప్రజలు క్షమించరని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూపాయి కూడా  కేంద్రం ఎక్కువ సాయం చేయలేదని.. ఈ పరిస్థితిలోనైనా రాష్ట్రాన్ని ఆదుకోవాలని విన్నవించారు. ఈ మేరకు  హైదరాబాద్ బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు.

వరుణయాగం చేసి దేవుడి మీద భారం వేశారు..

ఈ విపత్కర సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల, అగ్రికల్చర్, పవర్ మినిస్ట్రీలతో సమీక్ష చేయాల్సింది పోయి పట్టించుకోవడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ కు పోయి వరుణయాగం చేసి దేవుడు వానలు కురిపిస్తే కురిపించినట్లు లేకుంటే మీ ఖర్మ అన్నట్లు వదిలేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇప్పటికీ కోటి 20 లక్షల ఎకరాల పంట ఉందని.. నవంబర్ వరకు ఆ పంటలకు సంపూర్ణంగా కరెంట్ ఇస్తేనే ఆ పంటలు బతుకుతాయని చెప్పారు.

కరెంట్ సరిగా రావట్లేదు..

కరెంట్ ఉంటే కనీసం బోర్ల ద్వారా రైతులు పంటలను కాపాడుకునే పరిస్థితి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఊళ్లో కూడా 6 నుంచి 7 గంటలు కూడా కరెంట్ రావటం లేదని అన్నారు. సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో కూడా 7 గంటలు కరెంట్ రావడం లేదని చెప్పారు. “మీరు అడుక్కుంటారో, కొనుక్కుంటారో మాకు తెలియదు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే” అని డిమాండ్ చేశారు.

దక్షిణాది రాష్ట్రాలకు కరెంట్ ఇవ్వండి..

చాలా రాష్ట్రాల్లో అధికంగా కరెంట్ ఉత్పత్తి జరుగుతోందని.. ఆ కరెంట్ ను దక్షిణాది రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాలని కవిత (Kavitha) కోరారు.  కరెంట్ సప్లయ్ లేకపోవటం కారణంగా కూరగాయలు సహా అన్ని నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర కరువు పరిస్థితులపై సీఎం రేవంత్ తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Also Read : ముఖ్యమంత్రిగా బీసీ నేత.. మహేశ్ గౌడ్ కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>