నేటి నుంచి తెలంగాణ రక్షణ సేన విస్తృత సమావేశాలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వరసగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. విడతల వారీగా జిల్లాల వారీ కీలక నేతలతో భేటీ అయి, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, సంస్థాగత నిర్మాణం, రాబోయే రాజకీయ పరిణామాలపై నాయకులకు ఆమె దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ విస్తృత భేటీల్లో భాగంగా మొదటి రోజు ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కవిత సమావేశం కానున్నారు. అనంతరం సెప్టెంబర్ 28న మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నాయకులతో, సెప్టెంబర్ 29న నిజామాబాద్, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో భేటీలు జరగనున్నాయి. చివరి రోజు అంటే సెప్టెంబర్ 30న వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో కవిత సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ నాలుగు రోజుల సమావేశాలు ముగిసిన వెంటనే, త్వరలోనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ రూపొందించడంతో పాటు ప్రతి జిల్లాలో పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ విస్తృత సమావేశాలు దోహదపడనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>