‘ది ప్యారడైజ్’ సినిమా చూసిన కేటీఆర్.. ఆసక్తికర వ్యాఖ్యలు!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ‘ది ప్యారడైజ్’ సినిమా సందడి నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు బిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని (KTR The Paradise) వీక్షించారు. సినిమాలో కేసీఆర్ పాత్ర ఆధారంగా రూపొందించిన సీన్స్ రాగానే థియేటర్‌లో ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు, కేకలతో దద్దరిల్లించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సినిమా యూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. “అణిచివేతపై తిరుగుబాటు చేసి పోరాటం సాగించిన అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సోదరుడు నానికి ప్రత్యేకంగా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఈ కథకు అత్యంత ప్రతిభావంతంగా చక్కటి దృశ్య రూపం ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అలాగే నటుడు ప్రియదర్శికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>