కలం, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు (Manuguru) సింగరేణి OC-2లో డంపర్ టైర్ పేలి కార్మికుడు మృతి చెందిన ఘటనపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడటం బాధాకరమని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.
సరైన పర్యవేక్షణ లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. కార్మికుల భద్రత విషయంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

