కలం, నిజామాబాద్ బ్యూరో: పాంచజన్యం సంకల్ప సభలో పాల్గొనేందుకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యకర్తలు కవితకు భారీ గజమాల వేశారు. కార్యకర్తలు అందించిన కత్తి పట్టుకుని విజయనాదం చేశారు అనంతరం అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. కవిత ర్యాలీగా బయల్దేరి నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానానికి చేరుకున్నారు. మహిళలు అక్కడ బోనాలు, బతుకమ్మలతో కవితకు స్వాగతం పలికారు. పార్టీ ఆవిర్భావం తరువాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో కవిత ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయ వర్గాలతో పాటు ఇందూరు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

