కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత (Kavitha) నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయం లో కార్తీక పూర్ణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకం విశేష పూజల్లో పాల్గొన్నారు.. భక్తుల కొంగుబంగారం నీలకంఠేశ్వరాలయం అని ఆమె పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి మరునాడు నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో పూజలు చేయడం తమ కుటుంబానికి ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
ఈ ఆలయంలో ఇంకా అభివృద్ధి సుందరీకరణ జరగాల్సిన అవసరం ఉందని అందుకోసం తనవంతుగా సహకరిస్తానని వెల్లడించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో దీపాలు ఇతర వస్తువులను శుభ్రం చేసిన యువకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

