పల్లె పోరు.. రేపే తొలి విడత ఎన్నికలు!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) సమరానికి సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తొలి విడతలో మొత్తం 404 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, అందులో 136 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 268 సర్పంచ్ స్థానాల కోసం 853 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

అలాగే 1,545 వార్డు స్థానాలకు గాను 3,333 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పుల్లంపేట మండలం వాతలూరు పంచాయతీలో అత్యధికంగా 12 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో అక్కడ ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది. ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేందుకు అధికారులు ఇప్పటివరకు 1.82 లక్షల ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>