ఇంట్లో ఏసీ పేలి అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం!

కలం, వెబ్ డెస్క్ : నెల్లూరులోని పత్తేఖాన్‌పేట రైతుబజార్ వెనుక ఉన్న ఒక నివాస గృహంలో ఎయిర్ కండిషనర్ (Nellore AC Blast) ఒక్కసారిగా పేలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుందిఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న తంజావూరు శారదమ్మ (75) మంటల ధాటికి గాయపడ్డారు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన చుట్టుపక్కల వారు సాహసంతో ఇంట్లోకి ప్రవేశించి, లోపల చిక్కుకున్న శారదమ్మను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆమెను వెంటనే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అగ్ని ప్రమాదం ధాటికి ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ఘటనతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

కాగా, ఏసీలలో కంప్రెసర్ అధికంగా వేడెక్కడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా సరైన సమయంలో సర్వీసింగ్ చేయించకపోవడం వంటి కారణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు ఎప్పటికప్పుడు ఏసీల వైరింగ్, కంప్రెసర్ పనితీరును తనిఖీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>