Mobile Popup Ad
Mobile Popup Ad

రేపే కవిత కొత్త పార్టీ.. అతిథులకు అదిరిపోయే వంటకాలు!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. ఉదయం 7.30 గంటలకు కవిత బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్ తో అద్వయ కన్వెన్షన్ కి రానున్నారు. గంటన్నర పాటు కవిత ప్రసంగం ఉండే అవకాశం ఉంది. పార్టీ పేరుతో పాటు సిద్ధాంతాలు, సామాజిక లక్ష్యాల వంటి అంశాలను వివరించబోతున్నారు.

వాటికి తెలంగాణ ప్రముఖుల పేర్లు..

పార్టీ ప్రకటన సభకు తెలంగాణ ప్రముఖుల పేర్లను ఖరారు చేస్తూ కవిత (Kalvakuntla Kavitha) నిర్ణయం తీసుకున్నారు. సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ నారాయణ రావు, ఇతర ద్వారాలకు రాణి రుద్రమ దేవి, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ ద్వారాలు అనే పేర్లను పెట్టారు.

34 రకాల నోరూరించే వంటకాలతో..

నూతన పార్టీ ప్రకటన వేడుకకు 33 జిల్లాల నుంచి 50 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వీరి కోసం 34 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేశారు. దీనిలో నాన్ వెజ్ లో.. తలకాయ కూర, బోటీ ఫ్రై, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, బొమ్మిడాయల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చి కా సాలాన్, ఎగ్ ఇగురు వడ్డించనున్నారు. వెజిటేరియల్ లో భగారా బైంగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలూ టామాటా, చామగడ్డ పులుసు, కట్ చారు సిద్ధం చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచిన మక్క గారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలను కూడా మెనులో చేర్చారు. వీటితో పాటు బగరా రైస్, వైట్ రైస్, సాంబర్, రోటి పచ్చడి, దోస, ఆవకాయ, మిర్చి బజ్జి, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా కూడా ఉండనున్నాయి. మజ్జిగ, రాగి అంబలి, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహి తుక్ డా, జిలేబీ పెట్టనున్నారు.

Read Also: ఏప్రిల్ 27 తర్వాతే పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక.. ఎందుకంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>