Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్ కళ్యాణ్, లోకేష్ లపై కల్వకుంట్ల కవిత ఫైర్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో విస్తరిస్తామన్న నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఆకాంక్షలపై టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని కట్టడం చేతకాక ఆంధ్రా ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు అక్కడి నాయకులు కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టారని ఆమె అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణంపై టీఆర్ఎస్ అధినేత కవిత స్పందించారు. పవన్ కళ్యాణ్ ముందు వాళ్ల సెక్రటేరియేట్ లోకి వానకాలం నీళ్లు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఆంధ్రా నాయకులకు ఏమైనా అయ్యిందంటే హైదరాబాద్ కు వచ్చి వైద్యం చేయించుకుంటారని.. కానీ ఆంధ్రాలో మాత్రం హాస్పిటల్స్ కట్టటం లేదని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ పై మాట్లాడితే ప్రొఫెసర్ నాగేశ్వర్, పాపం యాదగిరి వంటి వారిపై ఎదురుదాడి చేశారని మండిపడ్డారు. ఆంధ్రా ఏజెంట్ తెలంగాణ సీఎంగా ఉండడం వల్లే తెలంగాణ మేధావుల ఇళ్లకు ఆంధ్రా పోలీసులు వస్తున్నారని చెప్పారు. రాజకీయంగా దమ్ముంటే ఎదుర్కోండి .. కానీ ప్రజల మధ్య చిచ్చుపెడితే మాట్లాడే వాళ్లు లేరనుకున్నారా? అని ప్రశ్నించారు. తమ మేధావులను టచ్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. లేనిపోని సాంస్కృతిక పెత్తనం చేయాలని చూస్తే సహించేది లేదని తెలిపారు. తమ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయం తరువాత చూసుకోండి. ముందు మీరు రాజధాని కట్టుకోండి అన్నారు. తెలంగాణ వాళ్లు ఎంతో పరిణితితో ఉంటారని , వేరే వాళ్లను ఇబ్బంది పెట్టామని చెప్పారు. షూటింగ్, వ్యాపారాలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని… వ్యాపారులకు రెడ్ కార్పేట్ పరుస్తామని చెప్పారు. అయితే తమ సెక్రటేరియట్ లో , రాజకీయాల్లో వేలు పెడతామంటే ఊరుకోనేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్స్ టెన్షన్ అవ్వటానికి లోకేష్ ఇది ఇది మీ సామ్రాజ్యమేమి కాదని కవిత అన్నారు. ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజలు ఓట్లు వేయకపోవటంతోనే దుకాణం బంద్ పెట్టుకున్నది మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చాలి

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచిన సరే ఉద్యమకారుల ఆకాంక్షలు నేరవేర్చటం లేదని కవిత ఆరోపించారు. ఎవరిని చూసి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారో వాళ్లు బాధ్యతగా ఇవి నెరవేర్చకపోతే ఉద్యమంగా మారుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన రేపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేరవేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోదావరి, కావేరి లింక్ ప్రాజెక్టు పోలవరం నుంచి పోతుందంటే ఒప్పుకుని సంతకం పెట్టి నీటి హక్కులు పోగొడుతున్నారని, ఇది సరికాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>