ఫోన్ ట్యాపింగ్‌పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి (MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ మాత్రమే కాకుండా తల్లి, భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన సీఎల్పీ మీడియా హాల్లో ప్రెస్ మీట్ లో అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. మీ భర్తతో మాట్లాడే విషయాలను వేరే వాళ్లు వింటే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం తమ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ‘ఇంటికి వెళ్తే నా భార్య తిడుతోంది. ‘నీ వల్లే నా ఫోన్ ట్యాపింగ్ చేశారని నా భార్య అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నా’ అని అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటివెన్నో ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. వ్యాపారం చేసుకుంటే బాగుండేదని అనిపిస్తోందని.. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని ఇప్పుడు ఆలోచిస్తున్నానని ఆయన తెలిపారు.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>