జూరాల వద్ద రోజంతా టెన్షన్.. రోడ్డెక్కిన ఆయకట్టు రైతులు

కలం, జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కుడి, ఎడమ కాల్వల వద్ద సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. మరో‌ పక్క ఎడమ కాల్వకు రైతులే స్వయంగా నీటిని విడుదల చేసుకోవడం.. దీంతో గంటల వ్యవధిలోనే అధికారులు గేట్లు మూసివేశారు. ఇక అధికారులు 24 గంటల్లో కుడి కాల్వకు సాగు నీటిని విడుదల చేస్తామని చెప్పిన గడువు కూడా ముగిసింది. దీంతో రైతులు ఆందోళనకు దిగే చాన్స్ ఉండగా ప్రాజెక్టుకు ఇరువైపులా పోలీసులను మోహరించారు.

అక్కడ ఆదివారం ఏ క్షణం.. ఏం జరుగుతుందోననే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులోని నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుని ‌కుడి, ఎడమ, సమాంతర కాల్వలతో పాటు నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు సాగు నీటిని పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ప్రాజెక్టులోని నీళ్లు తాగునీటి అవసరాలకే సరిపోతాయని, ఎల్ నినోతో నీటి నిల్వలు తగ్గే చాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.

నీళ్లు విడుదల చేయాలని ధర్నా..

ఎడమ కాల్వకు రైతులే నీళ్లు విడుదల ప్రాజెక్ట్ వద్ద శనివారం ధరూర్ మండలం రేవులపల్లి, భీంపురం గ్రామాలకు చెందిన రైతులు‌ కుడి కాల్వకు సాగు నీటి విడుదల చేయాలని ధర్నా చేపట్టారు. గంటల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి‌. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా రైతుల ఆందోళనపై అధికారులు ఏమాత్రం స్పందించలేదు. అదే సమయంలో అమరచింత మండలం నందిమల్ల, మూలమల్ల గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని‌ ఆందోళనకు దిగారు.

అంతేకాదు ఎడమ కాల్వ గేట్లను రైతులే స్వయంగా తెరిచి సాగు నీటిని విడుదల చేశారు. అదేరోజు రాత్రి ప్రాజెక్ట్ అధికారులు గేట్లు మూసివేశారు. అధికారులు విధించి‌‌న గడువు కూడా ముగియడంతో ప్రాజెక్ట్ వద్దకు రైతులు వస్తారనే సమాచారంతో ముందస్తుగా పోలీసులను మోహరించారు.

కుడి కాల్వ ఆయకట్టు రైతుల ఆందోళన..

ప్రాజెక్టు‌ కుడి కాల్వ గేట్లను ఆదివారం రైతులు ఓపెన్ చేసుకుంటారనే సమాచారంతో ధరూర్ రెవెన్యూ, పోలీస్ అధికారులు గస్తీ నిర్వహించారు. ఎడమ కాల్వ గేట్లు ఎత్తి నీటిని రైతులు విడుదల చేసుకోగా.. కుడి కాల్వ ఆయకట్టు ప్రాంత రైతులు తమ పంటలు ఎండిపోతుండగా అధికారులు ఎందుకు నీరు విడుదల చేస్తలేరని మండిపడుతున్నారు. వార బందీ ద్వారా సాగుకు నీరుందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>