కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా రామాయంపేట (Ramayampet) మండల కేంద్రంలో జొన్న రైతులు(Jowar Farmers) రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. జొన్నల కొనుగోలు విషయంలో అధికారులు నిబంధనల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని దంతేపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ అధికారులు నాణ్యత ప్రమాణాల పేరుతో రెండు లారీల జొన్నలను తిరస్కరించడంతో రైతులు ఆందోళనకు దిగారు. జొన్నలలో మట్టి శాతం ఎక్కువగా ఉందంటూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారని వారు తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే తమ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు.
ప్రభుత్వం సూచనల మేరకే పంట మార్పిడి విధానాన్ని అనుసరించి, సాంప్రదాయ పంటలకు బదులుగా జొన్నలు పండించామని రైతులు పేర్కొన్నారు. అయితే పంట చేతికొచ్చిన తర్వాత కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పంట మార్పిడి చేయాలని ప్రోత్సహించిన ప్రభుత్వమే ఇప్పుడు జొన్నల కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి నిబంధనలు లేకుండా జొన్నలను కొనుగోలు చేయాలని రైతులు (Jowar Farmers) డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ఇండియా స్థానంలో భారత్.. యూనివర్సిటీ డిగ్రీల్లో మార్పు!
Follow Us On: Instagram

