Mobile Popup Ad
Mobile Popup Ad

99 రోజుల యాక్షన్ షురూ.. గ్రేటర్ హైదరాబాద్‌పై సీఎం రేవంత్ ఫోకస్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్‌ఎంసీ (GHMC), సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, నగర శుభ్రత, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం తాజాగా 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ ప్రణాళికలో భాగంగా శానిటేషన్, మౌలిక సదుపాయాల మెరుగుదల, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి జరిపే సమీక్షా సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.

నగరంలో (Greater Hyderabad) పారిశుద్ధ్య నిర్వహణను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే నెల 3 లేదా 4 తేదీల్లో ఆయన స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఉదయం 6 గంటలకే అధికారులు విధుల్లో ఉండాలని, ఎక్కడైనా చెత్తాచెదారం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించారు.

సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసేందుకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. CURE పరిధిలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, హోటల్స్ కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని వెల్లడించారు. తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని ఏరియాలను గుర్తించి పైలట్ ప్రాజెక్టుగా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అధికారులకు సూచించారు.

Read Also :  టీవీకే చీఫ్​ విజయ్​కి మరో షాక్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>